NewsWorld
PredictionsDigestsScorecardTimelinesArticles
NewsWorld
HomePredictionsDigestsScorecardTimelinesArticlesWorldTechnologyPoliticsBusiness
AI-powered predictive news aggregation© 2026 NewsWorld. All rights reserved.
Trending
TrumpMajorMilitaryStrikesFebruaryIranAnnouncesIranianNewsAdditionalDigestSundayTimelineYearNuclearTargetingGameHumanoidGlobalMarketNipahLimitedChineseCampaign
TrumpMajorMilitaryStrikesFebruaryIranAnnouncesIranianNewsAdditionalDigestSundayTimelineYearNuclearTargetingGameHumanoidGlobalMarketNipahLimitedChineseCampaign
All Articles
YCP : రైతులకు రూ . 20వేలు ఎక్కడంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రశ్న
vaartha.com
Published 7 days ago

YCP : రైతులకు రూ . 20వేలు ఎక్కడంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రశ్న

vaartha.com · Feb 15, 2026 · Collected from GDELT

Summary

Published: 20260215T163000Z

Full Article

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ హామీని తుంగలో తొక్కారని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలోని సుమారు 54 లక్షల మంది రైతులకు ఏటా రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆశ చూపి, అధికారంలోకి వచ్చాక కేవలం రూ. 6,600 కోట్లు మాత్రమే కేటాయించడం రైతులను వంచించడమేనని వైసీపీ ఆరోపించింది. ఈ అరకొర నిధులు ఏ మూలకు సరిపోవని, చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్క్ మోసపూరిత రాజకీయాలకు తెరలేపారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. Revanth reddy: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు.. వైసీపీ తన విమర్శల్లో గణాంకాలను ప్రస్తావిస్తూ.. 54 లక్షల మంది రైతులకు రూ. 20 వేల చొప్పున ఇవ్వాలంటే బడ్జెట్‌లో కనీసం రూ. 10,000 కోట్లకు పైగా అవసరమవుతాయని పేర్కొంది. కానీ, బడ్జెట్‌లో కేటాయించిన రూ. 6,600 కోట్లతో ప్రతి రైతుకు హామీ ఇచ్చిన మొత్తం అందడం అసాధ్యమని విశ్లేషించింది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ‘రైతు భరోసా’ ద్వారా అందించిన సాయంతో పోల్చుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్ అంకెల గారడీతో అన్నదాతల కళ్లలో మట్టి కొడుతోందని ధ్వజమెత్తింది. ఈ నిధుల కేటాయింపు చూస్తుంటే ఈ ఏడాది కూడా రైతులకు కష్టాలు తప్పవని, పెట్టుబడి సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, ప్రభుత్వంపై వస్తున్న ఈ ఆరోపణలు సామాన్య రైతుల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఇచ్చిన హామీ ప్రకారం పూర్తిస్థాయి సాయం అందుతుందా లేదా అన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. కేవలం బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కాకుండా, అర్హులైన ప్రతి రైతుకు రూ. 20,000 అందించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ విమర్శలను ఎలా తిప్పికొడుతుంది మరియు రైతులకు ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేరుస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. Read hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.


Share this story

Read Original at vaartha.com

Related Articles

vaartha.com1 day ago
AP Liquor Scam : ఫిబ్రవరి 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్

Published: 20260221T201500Z

vaartha.com1 day ago
Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

Published: 20260221T201500Z

vaartha.com2 days ago
Kerala medical case : ఆపరేషన్ షాక్ , మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

Published: 20260220T181500Z

vaartha.com8 days ago
రోడ్డు - రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

Published: 20260214T130000Z

Gizmodoabout 1 hour ago
Trump’s FCC Chair Wants Networks to Run Nationalistic Content and Pledge Loyalty for America’s Big Bday

Fealty and Sousa marches in lieu of gifts, please.

The Hillabout 1 hour ago
GOP governor: Trump’s push to end TPS for Haitians ‘is wrong’

Ohio Gov. Mike DeWine (R) again defended Haitian migrants Sunday, as a legal challenge to the Trump administration’s attempts to revoke temporary protected status (TPS) for those from the Caribbean island plays out. “I think the policy to revoke that is wrong,” DeWine told host Margaret Brennan on CBS News’s “Face the Nation.” “I think...