NewsWorld
PredictionsDigestsScorecardTimelinesArticles
NewsWorld
HomePredictionsDigestsScorecardTimelinesArticlesWorldTechnologyPoliticsBusiness
AI-powered predictive news aggregation© 2026 NewsWorld. All rights reserved.
Trending
TrumpTariffTradeLaunchAnnouncePricesStrikesMajorFebruaryChinaMarketCourtNewsDigestSundayTimelineHongKongServiceMilitaryTechSafetyGlobalOil
TrumpTariffTradeLaunchAnnouncePricesStrikesMajorFebruaryChinaMarketCourtNewsDigestSundayTimelineHongKongServiceMilitaryTechSafetyGlobalOil
All Articles
Kerala medical case : ఆపరేషన్ షాక్ , మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన
vaartha.com
Published 2 days ago

Kerala medical case : ఆపరేషన్ షాక్ , మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

vaartha.com · Feb 20, 2026 · Collected from GDELT

Summary

Published: 20260220T181500Z

Full Article

Kerala medical case : కేరళలో వైద్యరంగాన్ని కలవరపరిచే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఐదేళ్లపాటు తీవ్రమైన నొప్పులతో జీవించాల్సి వచ్చింది. ఆపరేషన్ సమయంలో కడుపులో మిగిలిపోయిన సర్జికల్ పరికరాన్ని గుర్తించకుండా కుట్లు వేయడంతో ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడింది. అలప్పుజాకు చెందిన ఉషా జోసెఫ్ 2021లో గర్భాశయ సమస్యతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఆ సర్జరీ సమయంలో వైద్యులు పొరపాటున సర్జికల్ ఫోర్సెప్స్‌ను ఆమె కడుపులోనే వదిలివేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. శస్త్రచికిత్స అనంతరం ఉషకు నిరంతరం కడుపునొప్పి వస్తుండగా, పలుమార్లు అదే ఆసుపత్రికి వెళ్లినా సమస్యను సీరియస్‌గా తీసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. Read Also: Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి Kerala medical case తరువాత భరించలేని నొప్పితో ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించగా, అక్కడ తీసిన ఎక్స్‌రేలో కడుపులో లోహ పరికరం ఉన్నట్లు బయటపడింది. ఇది చూసి బాధితురాలు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన వైద్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ శస్త్రచికిత్సకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ లలితాంబిక ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఆ సర్జరీ తాను చేయలేదని ఆమె పేర్కొంటూ, పరికరం ఉన్నా ప్రాణాపాయం ఉండకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉషకు కలిగిన నొప్పి ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చని ఆమె వాదించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, ఘటనపై సమగ్ర దర్యాప్తుకు మెడికల్ బోర్డు నియమించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో ఉన్న పరికరాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపుతోంది. Read hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com Read Also: గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.


Share this story

Read Original at vaartha.com

Related Articles

vaartha.comabout 21 hours ago
AP Liquor Scam : ఫిబ్రవరి 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్

Published: 20260221T201500Z

vaartha.comabout 21 hours ago
Rythu Bharosa : రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

Published: 20260221T201500Z

vaartha.com7 days ago
YCP : రైతులకు రూ . 20వేలు ఎక్కడంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రశ్న

Published: 20260215T163000Z

vaartha.com8 days ago
రోడ్డు - రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ కు క్యాబినెట్ ఆమోదం

Published: 20260214T130000Z

TechCrunchabout 1 hour ago
China’s brain-computer interface industry is racing ahead

China’s brain-computer interface industry is rapidly scaling from research to commercialization, driven by strong policy support, expanding clinical trials, and growing investor interest.

Euronewsabout 1 hour ago
Hungary blocks adoption of EU sanctions package until Ukrainian oil supplies resume

No war loans can be handed to Ukraine until oil deliveries to Hungary are resumed, Prime Minister Viktor Orbán said after a meeting with the Energy Security Council.