NewsWorld
PredictionsDigestsScorecardTimelinesArticles
NewsWorld
HomePredictionsDigestsScorecardTimelinesArticlesWorldTechnologyPoliticsBusiness
AI-powered predictive news aggregation© 2026 NewsWorld. All rights reserved.
Trending
TrumpTariffTradeAnnounceLaunchNewsPricesStrikesMajorFebruaryPhotosYourCarLotSayCourtDigestSundayTimelineSafetyGlobalMarketTechChina
TrumpTariffTradeAnnounceLaunchNewsPricesStrikesMajorFebruaryPhotosYourCarLotSayCourtDigestSundayTimelineSafetyGlobalMarketTechChina
All Articles
కొలువుదీరనున్న పురాధీశులు .. | The rulers who are about to be crowned ..
andhrajyothy.com
Published 7 days ago

కొలువుదీరనున్న పురాధీశులు .. | The rulers who are about to be crowned ..

andhrajyothy.com · Feb 15, 2026 · Collected from GDELT

Summary

Published: 20260215T201500Z

Full Article

కొలువుదీరనున్న పురాధీశులు.. ABN , Publish Date - Feb 16 , 2026 | 01:08 AM సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెలువ డడం, క్యాంపు రాజకీయాలకు తరలివెళ్లడం జరిగింది. (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెలువ డడం, క్యాంపు రాజకీయాలకు తరలివెళ్లడం జరిగింది. తర్వాత ఘట్టం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పా టు చేసింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిల్‌ సభ్యులు, ఎక్స్‌అఫిషియో సభ్యులతో చేతులెత్తే పద్ధతిన పరోక్ష విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. అందుకు సంబంధించి ప్రత్యేక సమావేశ నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఆదివారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసిందిగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో నమో దైన వారికి నోటీసు జారీ చేశారు మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యంత కీలక మైన చైర్‌పర్సన్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వాణ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం పోలీస్‌ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం నిర్వ హణకు కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక అధికారి అధ్యక్షత వహిస్తారు. మరో అధికారి పరిశీలకుడిగా వేదికపై ఉంటారు. ప్రత్యేక సమావేశం లో ఆయా వార్డు సభ్యుల రాజకీయ పార్టీలకు, స్వతంత్రులకు వేరువే రుగా స్థానాలు కేటాయిస్తారు. మొదటగా 11 గంటలకు నూతనంగా ఎన్నికైన వార్డుసభ్యులతో ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తా రు. అనంతరం చైర్మన్‌ పదవి ఎన్నిక ప్రక్రియ చేపట్టి పోటీకి ప్రతిపా దనలు కోరుతారు. చైర్మన్‌ పదవికి ఒక వార్డు సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొకరు బలపరచాల్సి ఉంటుంది. ఆ విధంగా చైర్మన్‌ అభ్యరికి ఎక్కు వ ప్రతిపాదనలు వస్తే చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఉన్న అభ్యర్థిని చైర్మన్‌గా ప్రకటి స్తారు. అదే పద్ధతిలో వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఎన్నికకు కోరం తప్పనిసరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి కోరం తప్పనిసరి. కౌన్సిల్‌ సభ్యుల సంఖ్యలో సగం మంది సభ్యులు ఉన్నప్పుడే సమావేశం నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీ సభ్యులకు విప్‌ మున్సిపల్‌ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరగడంతో వార్డు సభ్యులకు, ఎక్‌సఅఫీషియో సభ్యులకు విప్‌ వర్తిస్తుంది. ఎన్నికల కమి షన్‌ నిబంధన ప్రకారం విప్‌ నియామకం జరుగుతుంది. విప్‌గా నియమితుడైన సభ్యుడు ఆయా సభ్యులకు విప్‌ జారీ చేస్తారు.చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపికపై తర్జనభర్జనలు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలపై జెండా ఏ పార్టీ ఎగరవే స్తుందో తేలిపోయిన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపికపై అర్థరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వేములవాడలో అస్పష్ట ఫలితం వచ్చిన కాంగ్రెస్‌ ఇతర కౌన్సిలర్ల మద్దతుతో జెండాను ఎగరవేయడం ఖాయంగా మారింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకున్నారు. మిగతా వార్డుల్లో కాంగ్రెస్‌ నుంచి ఆరుగు రు, బీజేపీ నుంచి ఐదుగురు, ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వేములవాడలో28 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వారిలో 13 మంది గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి8 మంది, ఇద్దరు ఇండిపెండెంట్‌ గెలుపొందారు. సంపూ ర్ణమైన మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రు లు కాంగెస్‌ గూటీలో చేరడంతో వేములవాడ బల్దియా పై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది. ఇందులో చైర్మన్‌ ఎన్నికపై కసరత్తు సుదీర్ఘంగా చేశారు. వైస్‌చైర్మన్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన శేఖర్‌ను ఎన్ను కోవడం లాంఛనంగానే భావిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైదరాబాద్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎన్నికైన కౌన్సిలర్లతో విడివిడిగా అభిప్రాయాలను సేక రించారు. సిరిసిల్ల నుంచి చైర్‌పర్సన్‌ స్థానం కోసం మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు మంచె రేణుక, దార్నం అరుణ, గుండ్లపల్ల్లి నీర జలు ప్రయత్నం చేశారు. మరోసారి సిరిసిల్ల చైర్‌పర్సన్‌గా జిందం కళ చక్రపాణీకే అవకాశం లభించిందని తెలిసింది. వైస్‌చైర్మన్‌ కోసం బుర్ర నారాయణ, గుడ్ల శ్రీనివాస్‌, దార్ల సందీప్‌, కల్లూరు రేణుకలు పోటీ పడ్డారు. మరోవైపు వైస్‌చైర్మన్‌ స్థానం పద్మశాలి కాకుండా ఇతరులకు ఇవ్వాలని ఆలోచనపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండు ము న్సిపాలిటీల పగ్గాలు ఎవరు చేపడతారనేదానిపై ఉత్కంఠగా సాగింది.చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాటు- ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సోమ వారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముందుగా సిరిసి ల్ల, వేములవాడ మున్సిపల్‌ కార్యాలయాల్లో కౌన్సిల్‌ సమావేశ మంది రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇందులో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, సంపత్‌ కుమార్‌, అధికారులు శ్రీనివాసాచారి, అన్సార్‌ తదితరులు పాల్గొన్నారు. Updated Date - Feb 16 , 2026 | 01:08 AM


Share this story

Read Original at andhrajyothy.com

Related Articles

andhrajyothy.com5 days ago
ఆవిష్కరణల కేంద్రం | Telangana Leads Pharma Innovation at BioAsia 2026

Published: 20260217T231500Z

andhrajyothy.com8 days ago
నేనే రాజు .. నేనే మంత్రి .. అదే నిజమా ..! | telangana municipal ennikalu congress dookudu neney raju neney mantri revant reddy pattu balapadinda

Published: 20260214T223000Z

economictimes.indiatimes.com43 minutes ago
SBI aims to hike its green advances portfolio up to 10 pc by 2030

Published: 20260222T144500Z

diariopalentino.esabout 1 hour ago
Sanz : Al festival de cine de Aguilar le espera un futuro ilusionante | Todas las noticias de Palencia

Published: 20260222T143000Z

kcbx.orgabout 1 hour ago
PHOTOS : Your car has a lot to say about who you are

Published: 20260222T143000Z

kenw.orgabout 1 hour ago
PHOTOS : Your car has a lot to say about who you are

Published: 20260222T143000Z